Homeహైదరాబాద్latest NewsGood news for cricket fans: క్రికెట్ అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన డిస్నీ

Good news for cricket fans: క్రికెట్ అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన డిస్నీ

టీ 20 వరల్డ్ కప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. టీ 20వరల్డ్ కప్‌ను డిస్నీప్లస్ హాట్ స్టార్ ఉచితంగా ప్రచారం చేయనున్నట్లు తెలిపింది. ఇండియాలోని యూజర్లు మొబైల్ వెర్షన్‌లో ఎలాంటి సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌‌‌‌‌ లేకుండా వరల్డ్ కప్‌ను వీక్షించొచ్చని డిస్నీ బుధవారం పేర్కొంది. అయితే టీ20 ప్రపంచకప్ 2024 బరిలోకి దిగే 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే జూన్ 1 నుంచి 29 వరకు అమెరికా, వెస్టిండీస్‌లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. గ్రూప్-ఎలో పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, అమెరికాతో భారత్ తలపడనుంది. జూన్ 5న న్యూయార్క్‌లో ఐర్లాండ్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. జూన్ 9న న్యూయార్క్‌లో దాయాది పాకిస్థాన్‌పై అమీతుమీ తేల్చుకోనున్నారు.

Recent

- Advertisment -spot_img