మహిళల ఆసియా కప్ తొమ్మిదో ఎడిషన్ జులై 19 నుంచి ప్రారంభంకానుంది. జులై 19న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ఢీకొననున్నాయి. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు అభిమానులకు శుభవార్త చెప్పింది. టోర్నీలో అన్ని మ్యాచ్‌లకు అభిమానులకు ఫ్రీ ఎంట్రీ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.