APSRTC బస్సులో తిరుమలకు వెళ్లే భక్తులకు కూటమి ప్రభుత్వం, టీటీడీ సువర్ణావకాశం కల్పించాయి. తిరుమలకు వెళ్లే భక్తుల కోసం రోజుకు 1000 దైవ దర్శనం టికెట్లు జారీ చేశాయి. ప్రయాణికులు రూ.300 అదనంగా చెల్లించి బస్సులోనే ఎక్స్‌ప్రెస్ దర్శనం టికెట్ పొందవచ్చు. ఈ శీఘ్ర దర్శనం ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4.00 గంటలకు నిర్వహించబడుతుంది. ఈ సదుపాయాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు.