Electronic Vehicles : ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్ న్యూస్..
Electronic Vehicles – రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి.
తెలంగాణలో ప్రస్తుతం 9,184 ఈవీలు రోడ్లపై తిరుగుతున్నాయి.
ఇందులో 7,367 బైక్‌లు ఉండగా, 984 కార్లు ఉన్నాయి. వీటితో పాటు త్రీ వీలర్లు 120, గూడ్స్వెహికిల్స్ 713 రోడ్లపై పరుగులు పెడుతున్నాయి.
పెరుగుతున్న వాహనాలకు అనుగుణంగా చార్జింగ్ స్టేషన్ల సంఖ్యను సైతం పెంచాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.
గతంలో ఈవీలను కొనుగోలు చేసేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించేవారు.
చార్జింగ్ స్టేషన్లు తక్కువగా ఉండటమే ఇందుకు కారణం.
కానీ, ప్రస్తుతం పెరుగుతున్న ఈవీల కొనుగోళ్లకు అనుగుణంగా చార్జింగ్స్టేషన్లను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే 30 ఎలక్ట్రిక్చార్జింగ్స్టేషన్లు ఉండగా కొత్తగా మరో 108 స్టేషన్లను ఏర్పాటుచేయాలని తెలంగాణ స్టేట్రెన్యూవబుల్ఎనర్జీ డెవలప్మెంట్కార్పొరేషన్లిమిటెడ్(టీఎస్రెడ్కో) ప్రణాళికలు రచిస్తోంది.
ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 88 స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
ఉమ్మడి వరంగల్, కరీంనగర్జిల్లాల్లో 10 స్టేషన్ల చొప్పున ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తోంది.
యూనిట్‌కు రూ.12.60 వసూలు చేయనున్నట్టు సమాచారం. ఇందులో డిస్కంలకు రూ.6 చేరనున్నాయి.
మిగిలినవి నిర్వాహకులకు చెందుతాయి.
ఈ స్టేషన్లకు సంబంధించిన విద్యుత్ కమర్షియల్‌కు ఒక ఎస్టిమేషన్, డొమెస్టిక్ప్రకారం మరో ఎస్టిమేషన్ వేసే చాన్స్ ఉంది.
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌ధరలు పెరిగినందున ఎలక్ట్రిక్‌వాహనాలను వినియోగించడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
వీటి వల్ల వాతావరణ కాలుష్యాన్ని సైతం తగ్గించవచ్చని అంటున్నారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్వాహనాలనే వినియోగించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీచేసింది.
ఈవీల వాడకాన్ని పెంచేందుకే ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌ధరలను పెంచిందని చెబుతున్న వారూ ఉన్నారు.
అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఎలక్ట్రిక్‌వాహనాలను వినియోగించాలని ఎప్పటి నుంచో ప్రభుత్వం సూచిస్తోంది.
కాగా, రాష్ట్ర ప్రభుత్వం సైతం పైలెట్‌ప్రాజెక్టుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈవీలను విడుతలవారీగా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.
నేడు, రేపు ‘గో ఎలక్ట్రిక్’ క్యాంపెయిన్
ఎలక్ట్రిక్‌వాహనాల వినియోగాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్రెడ్కో ప్రజలకు అవగాహన కల్పించనున్నాయి.
అందుకుగానూ శని, ఆదివారాలు రెండు రోజులపాటు ‘గో ఎలక్ట్రిక్’ క్యాంపెయిన్‌ను నిర్వహించనున్నాయి.
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ప్లాజా వేదికగా ఎలక్ట్రిక్‌వాహనాల రోడ్‌షోను ఏర్పాటు చేయనున్నాయి.
ఈ షోను మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించనున్నారు.