Homeహైదరాబాద్latest NewsEmployees: ఉద్యోగులకు శుభవార్త.. వారి బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!

Employees: ఉద్యోగులకు శుభవార్త.. వారి బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!

Employees: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. రాబోయే రెండు రోజుల్లో ఈ మేరకు ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఈ బదిలీ ప్రక్రియలో భాగంగా, ఉద్యోగులు జూన్ 16 వరకు HRMS పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. బదిలీ ప్రక్రియ జూన్ 22 నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది.

ప్రభుత్వం ఈ బదిలీలలో కొన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వనుంది. మ్యూచువల్ బదిలీలు, స్పౌజ్ కేసులు, మెడికల్ ఆధారిత బదిలీలు, దివ్యాంగ ఉద్యోగులు, గిరిజన ప్రాంతాల్లో పని చేసిన వారు, అలాగే కారుణ్య నియామకాలకు సంబంధించిన ఉద్యోగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ బదిలీల ద్వారా ఉద్యోగులకు తమ సొంత ప్రాంతాల్లో లేదా అనుకూలమైన ప్రదేశాల్లో సేవలు అందించే అవకాశం లభించనుంది. ఈ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అధికార వర్గాలు తెలిపాయి.

Recent

- Advertisment -spot_img