నూతన సంవత్సరం సందర్భంగా స్టార్ హీరో శివరాజ్‌కుమార్, ఆయన భార్య గీత ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. అమెరికా నుంచి వీడియో సందేశం ద్వారా శివరాజ్‌కుమార్ తన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం ఇచ్చారు. ఇప్పటివరకు తనకు చికిత్స అందించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మునుపటికంటే రెట్టింపు పవర్‌తో మీ ముందుకు వస్తానని శివరాజ్‌కుమార్ చెప్పుకొచ్చాడు. కీమోథెరపీ చేయించుకుంటున్న సమయంలో 45 సినిమా క్లైమాక్స్ ఫైట్‌లో పాల్గొన్నాను తెలిపారు. సమయం గడిచేకొద్దీ టెన్షన్ పెరిగింది. చిన్ననాటి స్నేహితులు శేఖర్, విజయప్రసాద్, భార్య గీత, సోదరుడు, బంధువులు, మంత్రి మధుబంగారప్ప, కూతురు తదితరుల సహకారం మరువలేనిది. హీరో శివరాజ్‌కుమార్‌కు క్యాన్సర్ రహితమైనట్లు అధికారికంగా తన భార్య ప్రకటించారు.