గత ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయకుండా మోసం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ విమర్శించారు. తొలి ఐదేళ్లలో గత ప్రభుత్వం కేవలం రుణమాఫీ కింద వడ్డీ చెల్లించిందని అన్నారు. తాము 6 నెలల్లో రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేశామని తెలిపారు. ఈ వర్షాకాలంలో దేశంలోనే అధిక వరి పండించిన ఘనత తెలంగాణదేనని అన్నారు. ఉమ్మడి ఏపీలోనూ ఇంత మొత్తంలో వరి దిగుబడి రాలేదని చెప్పారు. ఇంకా కొందరికి రుణమాఫీ కావాల్సి ఉందని.. దానిపై రేపు నిర్ణయం తీసుకుంటామన్నారు.