దసరా నుంచి రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకు అవసరమైన నిధులు సిద్ధం చేసుకోవాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించినట్టు తెలిసింది. ఈ సారి ఎకరాకు రూ.7,500 చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వనున్నారు. కొన్ని నిబంధనలతో పకడ్బందీగా రైతు భరోసాను అమలు చేయబోతున్నారని సమాచారం.