మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజామాబాద్‌లోని రైతు మహోత్సవ సభలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు శుభవార్త అందించారు. పెండింగ్‌లో ఉన్న ధాన్యం బోనస్ డబ్బులను అతి త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ నెలాఖరులోగా దీనిపై స్పష్టత ఇస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆయన కేంద్రం ప్రకటించిన పసుపు బోర్డు పరిస్థితిపై స్థానిక బీజేపీ ఎంపీ అర్వింద్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాక, గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి శాఖకు రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసినప్పటికీ, అదనంగా ఒక్క ఎకరానికి కూడా నీరు అందించలేకపోయిందని విమర్శించారు.