వరి, పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ధాన్యం, పత్తి విక్రయించిన రైతుల ఖాతాల్లో వెంటనే నగదు జమ చేయాలన్నారు. మంగళవారం ఆయన రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా రైతువేదికల్లోని అన్నదాతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సచివాలయం నుంచి పాల్గొన్నారు.