సన్న రకం వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్ కు రూ.500 చొప్పున బోనస్ చెల్లిస్తోందని CM రేవంత్ తెలిపారు. ‘ఎకరాకు 20-24 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తోంది. బోనస్ ఇవ్వడం వల్ల రైతులకు ఎకరాకు ₹10వేల నుంచి ₹12వేల వరకు అదనపు ఆదాయం అందుతోంది’ అనే వార్తను ఆయన ఎక్స్ లో షేర్ చేశారు. ‘రైతన్నలకు ఎకరాకు ₹12 వేల బోనస్ ఇవ్వడం ద్వారా వ్యవ”సాయా”న్ని పండగ చేసే ఈ ప్రయత్నం గొప్ప తృప్తిని ఇస్తోంది’ అని పేర్కొన్నారు.