Crop Bonus : రైతులకు బోనస్ తప్పకుండా ఇస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి స్పష్టం చేశారు. గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కేసీఆర్ దుర్మార్గ పాలకు బీజేపీ కూడా సహకరించిందని ఆరోపించారు. వేములవాడ, కొండగట్టు, కాళేశ్వరం, ధర్మపురికి ప్రసాద్ పథకం ద్వారా నిధులు ఇవ్వకుండా బీజేపీ నాయకులు అడ్డుపడ్డారని మండిపడ్డారు.