ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా హామీల అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. ఉచిత వంటగ్యాస్ సిలిండర్ల పథకం దీపావళి నుంచి ప్రారంభమైంది. అలాగే తాజా బడ్జెట్‌లో ఇతర పథకాలకు కూడా నిధులు కేటాయించారు. ఈ సమయంలో అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కో రైతుకు రూ.20వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం అమలుపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. అన్నదాతలకు కేంద్రం ఏటా ఇచ్చే రూ.6 వేలతో పాటు అన్నదాత సుఖీభవ పథం కింద మొత్తం రూ.20 వేలు అందజేస్తామన్నారు. త్వరలో రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు కొనసాగుతుందని వెల్లడించారు. ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన బడ్జెట్‌లో ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.4,500 కోట్లు కేటాయించిందని తెలుస్తుంది.