తెలంగాణలో పంటల బీమా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వమే రైతుల పక్షాన ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలోని 110 రైతు వేదికల్లో రూ.4 కోట్లకు పైగా నిధులు వెచ్చించి వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది ఆయిల్ సాగు పథకం కింద కేంద్రం రూ.80.10 కోట్లు విడుదల చేయగా.. రాష్ట్ర వాటా కలుపుకొని మొత్తంగా రూ.133.5 కోట్లు విడుదల చేశామన్నారు. లక్ష ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు చేపట్టడమే తమ లక్ష్యమన్నారు.