Homeహైదరాబాద్latest Newsరైతులకు గుడ్ న్యూస్.. జులై నుంచే రుణమాఫీ ప్రారంభిస్తాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

రైతులకు గుడ్ న్యూస్.. జులై నుంచే రుణమాఫీ ప్రారంభిస్తాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

పేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఇందిరమ్మ ప్రభుత్వం వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని, ఎన్నికల సమయంలో ఏ హామీలను ఇచ్చామో వాటన్నింటిని విడతల వారిగా నెరవేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఖమ్మంలో జిల్లాలో పర్యటించిన పొంగులేటి ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. రెండులక్షల రుణ మాఫీ అమలు ప్రక్రియ ఎప్పుటి నుండి మొదలు అవుతుందనే దానిపై మంత్రి పొంగులేటి క్లారిటీ ఇచ్చారు. వచ్చే నెల (జూలై) నుండి రైతులకు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. హామీ ఇచ్చినట్లుగా రూ.31 వేల కోట్ల రైతుల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. పేదలకు ఇచ్చిన హామీల అమలుపై వెనకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారు. జూలై నుండి రుణమాఫీ అమలు ప్రక్రియను మొదలు పెట్టి.. సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేసినట్లుగా పంద్రాగస్ట్ లోపు మొత్తం మాఫీ ప్రాసెస్‌ను కంప్లీట్ చేయాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఏకకాలంలో రూ.2 లక్షలు రుణ మాఫీ చేస్తామని నిన్నమీడియాతో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Recent

- Advertisment -spot_img