Homeహైదరాబాద్latest Newsరుణమాఫీ అందని రైతులకు శుభవార్త.. దసరాలోగా ఖాతాల్లో నగదు జమ..!

రుణమాఫీ అందని రైతులకు శుభవార్త.. దసరాలోగా ఖాతాల్లో నగదు జమ..!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దసరా లోగా నాలుగో విడత రుణమాఫీ పూర్తి చేయాలని నిర్ణయించింది. రైతు రుణమాఫీ అందని అర్హులైన వారికి నిధుల జమ పూర్తి చేయాలని భావిస్తుంది. ఇందుకోసం కసరత్తు ప్రారంభించింది. వచ్చేనెల తొలి వారంలో నిధులు జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు. దసరా పండుగలోగా 4.25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ మేరకు నిధుల సర్దుబాటు పైన దృష్టి పెట్టింది.

Recent

- Advertisment -spot_img