బంగారం కొనుగోలుదారులకు అదిరిపోయే శుభవార్త. గత కొన్ని రోజులతో పోలిస్తే తాజా బంగారం ధరలు తగ్గడంతో తిరిగి కొనుగోలు చేయాలనే ఆలోచనలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.78,900 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.86,070కు చేరింది. అటు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.1,08,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.