Homeహైదరాబాద్latest Newsపసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గుముఖం..!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గుముఖం..!

కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. అయితే తాజాగా ఆర్థిక సర్వే పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది. బంగారం ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఆర్థిక సర్వే తెలిపింది. ప్రపంచ అనిశ్చితి కారణంగా చాలా సెంట్రల్ బ్యాంకులు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు బంగారాన్ని నిల్వ చేస్తున్నాయి. 2024లో బంగారు కడ్డీ నిల్వలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఈ డిమాండ్ బంగారం ధరలు పెరగడానికి దోహదపడింది. ఈ ఏడాది డిమాండ్ తగ్గుముఖం పట్టి ధరలు తగ్గుతాయని సర్వే పేర్కొంది.

Recent

- Advertisment -spot_img