పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం ధరలు మళ్ళీ తగ్గిందోచ్. కొన్ని రోజులుగా గరిష్ట స్థాయిలో ఉన్న బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గి రూ.82,150కి చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 తగ్గి రూ.89,620కి చేరుకుంది. అదేవిధంగా వెండి ధర కూడా కిలోకు రూ.100 తగ్గి రూ.1,09,900కి చేరుకుంది. తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి.