దేశీయ బులియన్ మార్కెట్లో వరుసగా మూడు రోజుల పాటు పెరిగిన బంగారం ధరలు సోమవారం తగ్గాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 200 తగ్గడంతో రూ. 71,000 కి చేరింది. ఇంకా 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.220 తగ్గడంతో రూ. 77,450 కి చేరుకుంది. అదే విధంగా కిలో వెండి ధర రూ. 1,03,000గా ఉంది.