Homeహైదరాబాద్Good News For Home Seekers : ఇళ్లు కొనాలనుకునే వారికి శుభవార్త

Good News For Home Seekers : ఇళ్లు కొనాలనుకునే వారికి శుభవార్త

Good News For Home Seekers : ఇళ్లు కొనాలనుకునే వారికి శుభవార్త…

భారతదేశంలో సుప్రసిద్ధ ఆన్‌లైన్‌ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ ప్రాప్‌ టైగర్‌ డాట్‌ కామ్‌, అక్టోబర్‌ 9-10 తేదీలలో హైదరాబాద్‌లో ‘రైట్‌ టు హోమ్‌’ మెగా ఆఫ్‌లైన్‌ ప్రోపర్టీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొంది.

హైటెక్‌ సిటీ సమీపంలోని నోవోటెల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ వార్షిక కార్యక్రమాన్ని ఆర్‌ఈఏ ఇండియా సొంత కంపెనీ నిర్వహించబోతుంది.

హైదరాబాద్‌లోని గృహ కొనుగోలుదారులు, సుప్రసిద్ధ డెవలపర్లను ముఖాముఖిగా కలుసుకుని, అత్యుత్తమ పండుగ ఆఫర్లను పొందే అవకాశం పొందగలరు.

రెండు రోజుల పాటు జరిగే ఈ ఎక్స్‌పోలో నగరంలో సుప్రసిద్ధ డెవలపర్లు అయినటువంటి బ్రిగేడ్‌, ప్రెస్టిజ్‌, శ్రీరామ్‌, ఇన్కార్‌, రామ్కీ, ఫార్చ్యూన్‌ వంటి సంస్ధలు పాల్గొననున్నాయి.

”ఆస్తి కొనుగోలుకు అత్యుత్తమ సమయంగా పండుగ సీజన్‌ను మనం భావిస్తుంటాం.

కానీ 2021 పండుగ సీజన్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైనంతగా మరే ఇతర సంవత్సరాల్లోనూ పండుగ సీజన్‌ను చూడలేదనడంలో అతిశయోక్తి లేదు.

ఇప్పటికే ఈ రైట్‌ టు హోమ్‌ కార్యక్రమానికి 2300కు పైగా రిజిస్ట్రేషన్లు హైదరాబాద్‌లో జరిగాయి.

ఈ రెండు రోజుల భారీ కార్యక్రమంలో 300కు పైగా వాకిన్స్‌ వస్తాయని అంచనా వేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img