Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏంటంటే..?

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏంటంటే..?

హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించే వారికి తీపికబురు. మెట్రో ట్రైన్ వేళలు పొడిగించారు. దీని వల్ల ప్రయాణికులకు ఊరట లభిస్తుందని అనుకోవచ్చు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్ శ‌నివారం జరగనుంది. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి వరకు మెట్రో సేవలను పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. అన్ని దిశలలోని చివరి రైళ్లు తెల్లవారుజామున 1 గంట‌కు బయలుదేరుతాయని మెట్రో పేర్కొంది.

Recent

- Advertisment -spot_img