Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. దసరా సెలవుల్లో బంపర్ ఆఫర్..!

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. దసరా సెలవుల్లో బంపర్ ఆఫర్..!

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అధికారులు శుభవార్త చెప్పనున్నారు. సూపర్ హాలిడే కార్డు గురించి మీకు తెలుసా? అదే నండి.. సెలవు రోజుల్లో మెట్రోలో ప్రయాణించడానికి కేవలం రూ.59 చెల్లించి.. రోజంతా ప్రయాణం చేయవచ్చు. అయితే దీనికి సెప్టెంబర్ 28, 29 తేదీల్లో పథకం గడువు ముగుస్తుంది. అయితే ఎల్ అండ్ టీ అధికారులు దీని గడువు తేదీని పొడిగించనున్నట్లు సమాచారం. గత సంవత్సరం బతుకమ్మ పండగ మొదలయ్యే రోజు ఈ పథకాన్ని ప్రారంభించారు. అంతే కాదు.. మధ్యలో ఒకటి రెండు సార్లు కూడా దీనిని పొడిగించారు. ఈ సారి బతుకమ్మ పండుగ వస్తున్న నేపథ్యంలో కార్డు గుడువును కూడా మరోసారి పొడిగించే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ దసరా సెలవులు రోజుల్లో ఈ కార్డు ద్వారా ఎంచక్కా సిటీ అంతా మెట్రోలో ప్రయాణం చేయవచ్చు.

spot_img

Recent

- Advertisment -spot_img