Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త..!

హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త..!

హైదరాబాద్ లో పగటిపూట మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రయాణికుల కోసం ప్రత్యేక ఛార్జీలతో మొదటి మరియు చివరి రైలు కనెక్టివిటీని మెరుగుపరచడానికి మెట్రో రైల్ రాపిడోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఏడేళ్లలో హైదరాబాద్ మెట్రోలో 50 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించారు. ప్రతిరోజు సగటున 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రో రైలులో తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలోని 57 మెట్రో స్టేషన్లలో దేనికైనా వెళ్లే ప్రయాణికులు కేవలం రూ. 30 నుంచి చార్జీలు ప్రారంభం కాగా.. రాపిడో ఈ ఏడాది ఏకంగా 10 మిలియన్లకు పైగా మెట్రో బుకింగ్‌లను పూర్తి చేసినట్లు చెబుతున్నారు. 69.2 కి.మీ మెట్రో మార్గం దశలవారీగా ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. తాజాగా 57 మెట్రో స్టేషన్లలో మెట్రో రైల్ ర్యాపిడుతో మెట్రో రైల్ ఒప్పందం చేసుకుంది. ప్రయాణికులు బైక్ మెట్రో రైడ్‌లలో ఫ్లాట్ తగ్గింపు ధరలతో ఈ సౌకర్యాన్ని పొందవచ్చు.

Recent

- Advertisment -spot_img