Homeహైదరాబాద్latest Newsఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. నెలాఖరులోగా కీలక ప్రకటన..!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. నెలాఖరులోగా కీలక ప్రకటన..!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త చెప్పడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేసే లక్ష్యంతో, ప్రతి గ్రామంలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఇందిరమ్మ కమిటీల ద్వారా అధికారులు జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అనర్హులకు ఇళ్లు మంజూరు చేయరాదని అధికారులకు కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం కింద అర్హులైన వారికి రూ.5 లక్షల ఆర్థిక సహాయంతో ఇళ్లు నిర్మించేందుకు సహకారం అందిస్తున్నారు. మొదటి విడతలో 71,000 నుండి 72,000 మంది లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియలో ఉన్నారు. అయితే అనర్హులను తొలగించడంతో 42,000 మందికి మాత్రమే మంజూరు పత్రాలు జారీ అయ్యాయి. ఈ నెలాఖరులోగా లబ్ధిదారులను ప్రకటించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img