క్రిస్మస్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో పలు ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తోంది. ముఖ్యంగా iPhone 15 Plusపై అద్భుతమైన డీల్ తీసుకొచ్చింది. iPhone 15 Plus మొబైల్ 128GB స్టోరేజ్ వేరియంట్ ప్రారంభంలో రూ.89,900 ధరకు లాంచ్ అయ్యింది. ఇప్పుడు దీని ధర రూ.79,900కి తగ్గింది. అయితే బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ఇది కేవలం రూ.63,999కే లభిస్తోంది.