వినియోగదారులకు రిలయన్స్ జియో మరో శుభవార్త చెప్పింది. రూ.1029 ప్లాన్‌లో కొన్ని మార్పులు చేసి సరికొత్త ప్లాన్ గా తీసుకొచ్చింది. వినోదం కోరుకునే వారికి ఈ ప్లాన్ బాగుంటుంది. ఈ ప్లాన్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్న OTT యాప్‌లలో కొన్ని మార్పులు చేసింది. ఈ ప్లాన్‌లో అమెజాన్ ప్రైమ్ లైట్‌ని ఆఫర్ చేసింది. ఇంతకుముందు, ఈ ప్లాన్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ వెర్షన్‌కు 84 రోజుల ఉచిత సబ్‌స్క్రిప్షన్ ఉంది. దానితోపాటు మీరు అమెజాన్ ప్రైమ్ లైట్ ని పొందుతారు. అలాగే 84 రోజుల పాటు, 168GB డేటా అందుబాటులో ఉంది. అంటే, మీరు ప్రతిరోజూ 2GB వరకు వేగవంతమైన ఇంటర్నెట్‌ని ఉపయోగించవచ్చు. దీనితో పాటు, మీరు ప్రతిరోజూ 100 ఉచిత SMSలను కూడా పొందుతారు. ఈ ప్లాన్ స్పెషల్ ఏమిటంటే ఇందులో 5G ఇంటర్నెట్ కూడా ఉంది. మీ ప్రాంతంలో 5G పనిచేస్తుంటే, మీరు ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా 5G ఇంటర్నెట్‌ని పూర్తిగా ఉపయోగించుకోవచ్చు.