భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12000 అందించే పథకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకున్న వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయనుంది. ఈ మేరకు ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి సమాచారాన్ని సేకరిస్తోంది. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా గైడ్లైన్స్ విడుదల చేయలేదు. దీంతో పేదలు ఆందోళన చెందుతున్నారు. తొలి విడతలో ఈ నెల 28న ఖాతాల్లో రూ.6000 చొప్పున జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.