తెలంగాణలో మద్యం ధరల పెంపు ప్రతిపాదనలు ప్రభుత్వం తిరస్కరించినట్లు తెలుస్తోంది. ధరలు పెంచాలని ఉత్పత్తిదారులు, పెంపుపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ప్రతిపాదనలు చేసినా ప్రభుత్వం అంగీకరించలేదని సమాచారం. ప్రతి రెండేళ్లకోసారి ధరల పెంపుపై త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంటుంది. ఇటీవల కూడా బీర్ల ధరలు రూ.20 చొప్పున, ఇతర మద్యం ధరలు రూ.30-40 చొప్పున పెంచాలని కమిటీ సిఫార్సు చేసింది.