తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ కింద లబ్ధి పొందిన రైతులకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు త్వరగా కొత్త పంట రుణాలు ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. పలువురు రైతులకు రుణాలు అందకపోవడంతో ఈ ఆదేశాలు జారీ చేశారు. రానున్న సంవత్సరంలో DCCBలు మంచి పనితీరు కనబరచాలని ఆకాంక్షించారు. గతంలో పలు DCCBల్లో తప్పులు జరిగాయని, అవి జరగకుండా చూసుకోవాలన్నారు. టెస్కాబ్-2025 క్యాలెండరును ఆవిష్కరించిన సందర్భంగా రుణమాఫీ, బ్యాంకుల పనితీరుపై సమీక్షించారు.