Homeహైదరాబాద్latest Newsమధ్యతరగతి కుటుంబాలకు శుభవార్త..హెచ్ఎండీఏ కీలక నిర్ణయం..!

మధ్యతరగతి కుటుంబాలకు శుభవార్త..హెచ్ఎండీఏ కీలక నిర్ణయం..!

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని భూముల వేలానికి హెచ్ ఎండీఏ మరోసారి సిద్ధమైంది. కొన్ని కొత్త లేఅవుట్లు వేయడానికి సన్నాహాలు చేస్తోంది.హెచ్‌ఎండీఏ కొత్త ప్రాజెక్టులను చేపట్టనుంది. ఎలివేటెడ్ కారిడార్‌తో పాటు ఓఆర్‌ఆర్‌ నుంచి ట్రిపుల్‌ఆర్‌ వరకు గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్లు కూడా త్వరలో నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన భూముల వేలంలో మిగిలిన భూములను మళ్లీ వేలం వేసి ఆదాయాన్ని పెంచుకోవాలని యోచిస్తోంది. గతంలో లేఅవుట్ వేసిన ఉప్పల్ భగాయత్ లో 70 ఎకరాల వరకు మిగిలిపోయినట్లు సమాచారం. కోకాపేటలో 50 నుంచి 70 ఎకరాలు, బుద్వేల్‌లో 50 ఎకరాలు మిగులుతున్నట్లు సమాచారం. అలాగే బాటసింగారం, ప్రతాపసింగారం, కొంగరకలాన్, ముత్తంగి తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, రంగారెడ్డి జిల్లా ఇన్ముల్నర్వ, మేడ్చల్ జిల్లా భోగారం, ప్రతాపసింగారం, లేమూరు ప్రాంతాల్లో 500 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని నిర్ణయించారు. చౌటుప్పల్ పరిధిలోని దండు మల్కాపూర్‌లో ఓఆర్‌ఆర్‌, ట్రిపుల్‌ఆర్‌ల మధ్య 325 ఎకరాలు సేకరించాలని నిర్ణయించింది. నాదర్‌గుల్‌లో 91 ఎకరాలు, ప్రతాపసింగారంలో 152 ఎకరాలు, భోగారంలో 125 ఎకరాలు, మేడ్చల్, రంగారెడ్డిలో మొత్తం 1,000 ఎకరాలు సేకరించాలని యోచిస్తోంది. ఈసారి హెచ్‌ఎండీఏ సిద్ధం చేసిన లేఅవుట్‌లలో కనీసం 50 శాతం మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు.

Recent

- Advertisment -spot_img