నందమూరి వారసుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తేజ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాలోని పోస్టర్ను రిలీజ్ చేశారు. ‘హనుమాన్’ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్న మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్లో మోక్షజ్ఞ నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన టైటిల్, అప్డేట్స్ వెల్లడిస్తామని మేకర్స్ పేర్కొన్నారు.