తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీ మేరకు రెండు లక్షల రూపాయల రైతుల రుణమాఫీ చేసింది. 18 వేల కోట్ల రూపాయలతో 22 లక్షల రైతుల రుణమాఫీ చేశామన్నారు. అయితే సాంకేతిక కారణాల వల్ల రైతులందరికీ రుణమాఫీ జరగలేదు. అందుకోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక శిబిరాలు కూడా నిర్వహించింది. రైతుల దరఖాస్తుల మేరకు వ్యవసాయ అధికారులు ఇంటింటికీ వెళ్లి కుటుంబ నిర్ధారణ సర్వే పూర్తి చేశారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఇంకా 13 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ వీలైనంత తొందరగా అమలు చేసి.. ప్రజల్లో ప్రభుత్వం మీద ఉన్న నిరాశను తీసేయటమే కాకుండా.. ప్రతిపక్షాలకు విమర్శలకు చెక్ పెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలుస్తుంది. డిసెంబర్ ఆఖరిలోపు రైతులకు పెండింగ్లో ఉన్న రుణమాఫీ రూ.13వేల కోట్లను పూర్తి చేస్తామని చెప్పారు. రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని తెలంగాణ సర్కార్ చెబుతుంది. రైతులు పండించిన చివరి గింజ వరకూ కొంటామని చెప్పారు.