Homeహైదరాబాద్latest Newsఎన్టీఆర్ అభిమానులకు పండగలాంటి వార్త.. 'దేవ‌ర' ట్రైల‌ర్‌ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది ఆరోజే..!

ఎన్టీఆర్ అభిమానులకు పండగలాంటి వార్త.. ‘దేవ‌ర’ ట్రైల‌ర్‌ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది ఆరోజే..!

ఎన్టీఆర్‌ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘దేవర’. ఈ మూవీ ట్రైలర్‌ను ఈ నెల 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ ను హీరో జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ సముద్రంలో పెద్ద రాయి మీద నిల్చొని ఉన్నాడు. వెనుక అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. చేతిలో పదునైన ఆయుధాన్ని పట్టుకుని కోపంగా చూస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ క్రేజీ అప్ డేట్ చూసి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ లవర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Recent

- Advertisment -spot_img