భారతీయులు ఎక్కువగా ఇష్టపడే వాటిలో సినిమాలు ఒకటి. చాలా మంది కొత్త సినిమాల విడుదల ఎదురు చూస్తున్నారు. సినిమా టాక్ బాగుంటే.. భాషతో సంబంధం లేకుండా థియేటర్‌తో పాటు ఇటు ఓటీటీ చూస్తారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో సినిమా ఓటీటీ ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియో కొత్త సినిమా తన కొత్త సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ జియో సినిమా ప్రీమియాన్ని ప్రకటించింది. కేవలం రూ.29లతో నెల మొత్తం వీక్షించేలా ఆఫర్‌ను తీసుకువచ్చింది. అయితే ఈ ఆఫర్ ఒక్క డివైస్‌కు మాత్రమే వర్తిస్తుంది. 4 డివైస్‌లు కావాలంటే రూ.89 ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.