చిన్నారుల తల్లిదండ్రులకు శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా ఆధార్ కార్డులు లేని ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్నారులు 1,86,709 మంది ఉన్నట్లు గ్రామ వార్డు సచివాలయాల శాఖ గుర్తించింది. వీరితో పాటు దాదాపు 52.02 లక్షల మంది ఆధార్‌లో తమ వివరాలు అప్‌డేట్ చేసుకోని వారు ఉన్నట్లు పేర్కొంది. ఈ నెలలో రెండు ఆధార్ క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించింది. 19 నుంచి 22వ తేదీ వరకు, అలాగే 25 నుంచి 28వ తేదీ వరకు ఆధార్ క్యాంపుల నిర్వహణ జరగనుంది.