Homeహైదరాబాద్latest Newsప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రూమర్ల పై క్లారిటీ ‘ది రాజాసాబ్‌’ మూవీ టీమ్..!

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రూమర్ల పై క్లారిటీ ‘ది రాజాసాబ్‌’ మూవీ టీమ్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా రొమాంటిక్ హారర్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ సినిమా 2025 ఏప్రిల్ 10న విడుదల కానుందని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమా కోసం వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ ఎక్కువ ఉన్న కారణంగా చెప్పిన తేదీకి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి అని వార్తలు వచ్చాయి. తాజాగా, ఈ పుకార్లపై స్పందిస్తూ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారిక లేఖను విడుదల చేసింది.ఈ సినిమా దాదాపు 80 శాతం షూటింగ్‌ పూర్తయింది. ఈ సినిమా గురించి ఏదైనా అప్డేట్ ఉంటె మేము అధికారికంగా ప్రకటిస్తాం అని తెలిపారు. త్వరలో టీజర్ రానుంది అని ప్రకటించారు. టీజర్ వదంతులపై స్పందించిన నిర్మాణ సంస్థ రాజాసాబ్ వాయిదా వార్తలపై స్పందించలేదు. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.

Recent

- Advertisment -spot_img