ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ. 1100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం త్వరలో జపాన్‌లో కూడా సందడి చేయబోతుంది. తాజా సమాచారం ప్రకారం జనవరి 3, 2025న జపాన్‌లో కల్కి 2898 ఏడీ గ్రాండ్‌గా విడుదల కానుంది.