సికింద్రాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని లక్నో వరకు ఈ నెల 15, 22 తేదీల్లో ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రోజు రాత్రి 7.05 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరే రైలు (నం.07084) 17న ఆదివారం సాయంత్రం 6 గంటలకు లక్నో చేరుకుంటుంది. తిరిగి 18న సోమవారం ఉదయం 9.50 గంటలకు బయలుదేరి 20న బుధవారం సాయంత్రం 3 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.