ముంబై రైల్వే ప్రయాణికుల కోసం కేంద్ర ప్రభుత్వం భారీ పథకాలకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా 300 కొత్త అదనపు లోకల్ రైళ్లను ప్రవేశపెట్టడంతో పాటు వసాయ్‌లో భారీ రైల్వే టెర్మినల్‌ను నిర్మించనున్నట్లు బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు ఆమోదం తెలిపిన ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.