ప్రతి నెలా రేషన్ కార్డుదారులకు రాయితీపై కందిపప్పు, పంచదార అందిస్తామని.. వచ్చే ఏడాది జనవరి నుంచి తృణధాన్యాలు కూడా పంపిణీ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలిలో మంగళవారం ఆయన కార్డుదారులకు రాయితీపై కిలో కందిపప్పు, అర కిలో పంచదార అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు.