తెలంగాణ రేషన్ కార్డుదారులకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుభవార్త చెప్పారు. సంక్రాంతి తర్వాత రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తామని వెల్లడించారు. మరో రెండు, మూడు నెలల్లో రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అమలు చేస్తామని అసెంబ్లీలో మంత్రి ప్రకటించారు. రేషన్‌కార్డు ద్వారా వచ్చిన బియ్యం అక్రమంగా తరలించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్త రేషన్ డీలర్ షాపులు ఇచ్చే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.