రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డు వివరాల మార్పులుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం, మరణించిన వృద్ధుల పేర్లను తొలగించడం.. మీసేవ కేంద్రాల్లో మార్పులకు అవకాశం కల్పించారు. రేషన్ కార్డుదారులు తమ వివరాలను మార్చుకోవడానికి మీసేవ కేంద్రానికి వెళ్లాలి. మీ సమీపంలోని మీ-సేవా కేంద్రానికి వెళ్లండి.. గుర్తింపు కార్డులు, అవసరమైన పత్రాలు మరియు వివరాలను జోడించాల్సిన లేదా మార్చాల్సిన వ్యక్తి ఫోటో తీసుకొని మీ-సేవా కేంద్రానికి వెళ్లండి. మీరు రేషన్ కార్డులో మీ భార్య పేరును చేర్చాలనుకుంటే, మీరు ఆమె ఫోటో, గుర్తింపు కార్డు మరియు వివాహ ధృవీకరణ పత్రంతో మీ-సేవా కేంద్రాన్ని సంప్రదించాలి. పిల్లల పేర్లను పొందుపరచాలంటే పిల్లల గుర్తింపు కార్డులు, జనన ధృవీకరణ పత్రాలు కావాలి. రేషన్ కార్డుల్లో మార్పులకు సంబంధించి… అవసరమైన పత్రాలను నిర్వాహకులు స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. మీ-సేవా కేంద్రాల ద్వారా అప్‌లోడ్ చేసిన మీ వివరాలు పౌరసరఫరాల శాఖకు చేరుతాయి. అధికారులు ఈ వివరాలను పరిశీలించి మార్పులను ఆమోదించనున్నారు. ఈ ప్రక్రియకు దాదాపు 7 రోజులు పట్టే అవకాశం ఉంది. మీరు మీ-సేవా కేంద్రంలో ఇచ్చిన దరఖాస్తు నంబర్ ద్వారా పౌర సరఫరాల అధికారిక వెబ్‌సైట్ https://civilsupplies.telangana.gov.inలో మీ రేషన్ కార్డ్ స్థితిని తనిఖీ చేయవచ్చు. రేషన్ కార్డులో ఏవైనా మార్పులు ఉంటే మీ మొబైల్‌కు మెసేజ్ వస్తుంది. మెసేజ్ రాకపోయినా ఆహార భద్రత కార్డులో వివరాలు అప్‌డేట్ చేయబడతాయి. మీ-సేవా కేంద్రాల్లో ఆహార భద్రత కార్డును ప్రింట్ తీసుకోవచ్చు.