బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు 25 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు APSRTC ప్రకటించింది. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ RTC బస్సులోనైనా ఈ రాయితీతో ప్రయాణించే వీలుంటుంది. సీనియర్ సిటిజన్లకు 60 ఏళ్ల వయసు పైబడి ఉండాలి. వయస్సుకు సంబంధించిన గుర్తింపు కార్డు ఏదైనా చూపించాల్సి ఉంటుంది. అది ఫిజికల్ లేదా డిజిటల్ రూపంలోనైనా చూపించవచ్చని APSRTC తెలిపింది.