తెలంగాణ రాష్ట్రంలో ప్రయాణికులు, కండక్టర్లకు మధ్య త్వరలోనే ‘చిల్లర’ సమస్యలు తీరనున్నాయి. బస్సుల్లో ఆన్‌లైన్ పేమెంట్ల కోసం RTC ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ముందుగా హైదరాబాద్‌లో పరిశీలించనుంది. ఆపై రాష్ట్రమంతటా వినియోగంలోకి తీసుకురానున్నారు. ఇప్పటికే సంస్థ చేతికి 6వేల ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ మెషీన్లు అందాయి. ప్రస్తుతం దూరప్రాంత రూట్లలోనే ఉండగా, త్వరలో ఇవి పల్లెవెలుగు వంటి గ్రామీణ ప్రాంత బస్సుల్లోనూ ఉపయోగించనున్నారు.