దేశంలోని దాదాపు అన్ని బ్యాంకులు ప్రతి నెల రుణాలపై, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరిస్తుంటాయి. తాజాగా ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు రేట్లను వెల్లడించింది. ఎంసీఎల్ఆర్ వడ్డీ రేట్లు 8.45% నుంచి 8.20 శాతానికి తగ్గించింది. అలాగే ఎంపిక చేసిన టెన్యూర్ లోన్లపై 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది.