సర్కారు బడుల్లో చదువుకునే పేద, మధ్య తరగతి విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనం ఇస్తోంది. ఎన్ఎంఎంఎస్ పరీక్షలో ప్రతిభ చూపిన వారికి 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏటా రూ.12 వేల చొప్పున ఉపకార వేతనం అందజేస్తోంది. అన్ని ప్రభుత్వ, ఆదర్శ పాఠశాల విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. ఏడో తరగతి ఫలితాల్లో 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 50 శాతం మార్కులు సాధిస్తే చాలు. కుటుంబ ఆదాయం రూ.3.50 లక్షల లోపు ఉండాలి.