Homeహైదరాబాద్latest Newsవిద్యార్థులకు శుభవార్త.. ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు.. ఎన్ని రోజులంటే..?

విద్యార్థులకు శుభవార్త.. ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు.. ఎన్ని రోజులంటే..?

విద్యార్థులకు శుభవార్త. వేసవి సెలవులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ సారి ఏకంగా 50 రోజులు వేసవి సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటికే 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు ముగిశాయి. మిగతా తరగతుల విద్యార్థులకు కూడా పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు ముగిసిన వెంటనే ప్రతి ఏటా వేసవి సెలవులను ప్రకటిస్తారు.

ఈ క్రమంలో.. ఈ సారి కూడా వేసవి సెలవులు ప్రకటించారు. తాజాగా వేసవి సెలవు సెలవులపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వేసవి సెలవుల తేదీలను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 23న స్కూళ్లకు చివరి పనిదినంగా పేర్కొంది. ఈ లెక్కన విద్యార్థులకు దాదాపు 50 రోజుల పాటు వేసవి సెలవులు ఉండనున్నాయి. తిరిగి జూన్ 12న స్కూళ్లు పున: ప్రారంభమవుతాయని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.

Recent

- Advertisment -spot_img