తెలంగాణ విద్యాశాఖ ఒంటిపూట బడుల(Half day schools)పై కీలక నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఒంటిపూట బడుల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 15 నుండి రాష్ట్రంలో ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయని ప్రకటించారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యాసంస్థలు సహా అన్ని ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలల్లో తరగతులు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయి. స్కూల్ మధ్యాహ్నం 12:30 గంటలకు భోజనంతో ముగుస్తాయి. ఏప్రిల్ 24 నుండి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 12న పాఠశాలలు తిరిగి తెరవబడతాయి.