రైతుల రుణమాఫీ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 4 రోజుల్లో రుణమాఫీకి మార్గదర్శకాలు రిలీజ్ చేస్తామని ఆయన అన్నారు. ప్రస్తుతం మంత్రివర్గ ఉపసంఘం, అధికార యంత్రాంగం.. దీనిపై కసరత్తు చేస్తోందని అన్నారు. ఐతే.. లబ్దిదారుల ఎంపికకు.. రేషన్ కార్డు ప్రామాణికం కాదని ఆయన అన్నారు. అందువల్ల రేషన్ కార్డు లేకపోతే, రుణమాఫీ రాదు అనే వాదనను సీఎం ఖండించినట్లైంది. అర్హులందరికీ రుణమాఫీ వచ్చేలా చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఒకేసారి రూ.2 లక్షల చొప్పున మాఫీ చేస్తామని అన్నారు. రేషన్ కార్డు అనేది కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే, లెక్కలోకి తీసుకుంటామని అన్నారు.